ఇక సినిమాలు తీయను అంటున్న బాలయ్య

ఇక సినిమాలు తీయను అంటున్న బాలయ్య
x
Highlights

నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ పైన బోలెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ 'ఎన్టీఆర్...

నందమూరి బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారకరామారావు బయోపిక్ పైన బోలెడు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ 'ఎన్టీఆర్ కథానాయకుడు', మరియు 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా మారాయి. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ బాలయ్య పైన బాగానే పడింది. మొదటిసారిగా బాలకృష్ణ దంపతులు పేర్లు నిర్మాతలుగా పడిన సినిమా ఇలాఇవ్వడం ఇవ్వడం బాలకృష్ణకు బాధాకరం గా మారింది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కూడా కొంత దిగులు చెందారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఫిలింనగర్ ఇప్పుడు మరొక షాకింగ్ న్యూస్ ఫాన్స్ ను మరింత బాధ పెడుతుంది. ఇక ఎన్.బి.కె ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత గా సినిమాలు చేసే ఆలోచన లేదని బాలయ్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతగా మారి నిర్మాణ పనులు కూడా చూసుకునే ఆసక్తి లేదని చెబుతున్నాడట బాలయ్య. తాజాగా బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య ఈ సినిమాను కూడా నిర్మించను అని క్లారిటీ ఇచ్చారట. భవిష్యత్తులో సంగతెలా ఉన్నా సరే ప్రస్తుతం మాత్రం బాలకృష్ణ మళ్లీ నిర్మాతగా మారే ఆలోచన లేదని ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories