రూలర్ : ట్విట్టర్‌ రివ్యూ

రూలర్ : ట్విట్టర్‌ రివ్యూ
x
Rular
Highlights

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో...

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్లుగా నటించారు. సీ కళ్యాణ్ సినిమాని నిర్మించగా, చిరంతన్‌ భట్ సంగీతమందించాడు. జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు.

గతంలో బాలకృష్ణ, కేయస్‌ రవికుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రం జైసింహా తర్వాత ఈ చిత్రం వస్తుండడంతో సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే బాలయ్య లుక్, సినిమా టీజర్, పాటలు సినిమాపైన భారీ అంచనాలకి క్రియేట్ చేశాయి. యూఎస్‌లో ఇప్పటికే రూలర్‌ ప్రీమియర్స్‌ షోస్‌ పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మిడ్‌నైట్‌ నుంచే సందడి మొదలైంది. సినిమా చూసిన వాళ్లు వాళ్ల అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు.

బాలకృష్ణ అంటేనే ఫుల్ ఎనర్జీటిక్ గా అయన సినిమాలు ఉంటాయి. బాలయ్య ఎలివేషన్‌ సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ సూపర్‌ అంటున్నారు ఫ్యాన్స్‌. ఇక పాటలో బాలయ్య ఎనర్జీ మరింత సూపర్‌ అంటున్నారు. ప్రతి సాంగ్‌కు థియేటర్లు విజిల్స్‌ పడుతున్నాయట. మొదటి భాగం బాగుందని, కానీ రెండో బాగం మాత్రం దర్శకుడు నిరాశపరిచాడన్న టాక్‌ వినిపిస్తోంది.

కానీ సినిమా మొత్తం బాలయ్య వన్‌మేన్‌ షోలా సాగిందని చెబుతున్నారు. బాలయ్య ముందు మిగతా పాత్రలు తెలిపోయాయని చెబుతున్నారు. రైతుల గురించి బాలయ్య చెప్పే సంభాషణలు, సన్నివేశాలు ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. బాలయ్య మార్క్‌ మాస్‌ యాక్షన్‌, పంచ్‌ డైలాగ్‌లు బాగా పేలాయని అని అంటున్నారు. చిరంతన్ భట్ సంగీతం సో సో గా ఉందని అంటున్నారు. రొటీన్ కథ అయినప్పటికీ సినిమాలో సాగదీత ఏక్కువగా ఉందని చెబుతున్నారు. మొత్తంగా రూలర్ అభిమానులకి మాత్రమేనన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories