Balakrishna Movie: బాలయ్య నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్పుడే మొదలు

Balakrishna Movie: బాలయ్య నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్పుడే మొదలు

admin1
Updated on: 12 Feb 2022 8:30 PM IST
Balakrishna Next Movie Shooting Has Started | Telugu Movie News
X

Balakrishna Movie: బాలయ్య నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్పుడే మొదలు

Balakrishna Movie: ఈ మధ్యనే అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ చేతిలో ఇప్పుడు బోలెడు ప్రాజెక్టులు వచ్చిపడ్డాయి. ప్రస్తుతం ఇందులో అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా #ఎన్బీకే107. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఒకవైపు "అఖండ" సినిమాతో బాలకృష్ణ మార్కెట్ పెరిగినట్టే "క్రాక్" సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గోపీచంద్ మలినేని తదుపరి సినిమాపై అంచనాలు కూడా అలానే పెరిగాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కాబట్టి అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా లో బాలకృష్ణ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 16 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ కి సంబంధించిన మొదటి షెడ్యూల్ తెలంగాణలోని సిరిసిల్ల ప్రాంతంలో జరగనుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో దునియా విజయ్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

admin1

admin1

Next Story