Balakrishna New Movie: జూలైలో బాలయ్య కొత్త సినిమా షూటింగ్

Balakrishna New Movie: బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ జులై నుండి ప్రారంభించేందు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందట.

Kranthi
Published on: 16 May 2021 11:49 AM IST
Balakrishna New Movie Shoot Starts From July
X

Balakrishna, Malineni Gopichand:(File Image)

Balakrishna New Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్ జులై నుండి ప్రారంభం కానున్నట్ల సమాచారం. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.

పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా ఈ సినిమా రానుందట. జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. ఈ కథలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్, పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు.

ఇక ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన 'బలుపు, క్రాక్' రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారని టాలీవుడ్ టాక్.

Kranthi

Kranthi

Next Story