Balakrishna: ఆసక్తికరమైన టైటిల్ తో బాలకృష్ణ సినిమా

Balakrishna: ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది * త్రిష లేదా ఇలియానా ఈ సినిమాలో హీరోయిన్

admin1
Updated on: 9 Oct 2021 11:30 AM IST
Balakrishna and Gopichand Movie Title Registered as Rowdyism in Film Chamber
X

 గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు (ఫోటో- ది హన్స్ ఇండియా)

Balakrishna New Movie: "డాన్ శీను", "బలుపు", "పండగ చేసుకో" వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని తాజాగా రవితేజ హీరోగా నటించిన "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నారు. ఇక గోపీచంద్ మలినేని తదుపరి సినిమా ఎవరితో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమాని పట్టాలెక్కించనున్నారు నందమూరి బాలకృష్ణ.

తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి "రౌడీయిజం" అనే టైటిల్ ను ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. త్రిష లేదా ఇలియానా ని ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేయనున్నారు దర్శకనిర్మాతలు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. బాలకృష్ణ ఈ సినిమాలో గూగుల్ సీఈవో గా మరియు ఒక రైతు గా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నరని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

admin1

admin1

Next Story