వైరల్ గా మారిన బాలకృష్ణ న్యూ లుక్.. ఇదంతా సినిమా కోసమేనా ?

వైరల్ గా మారిన బాలకృష్ణ న్యూ లుక్.. ఇదంతా సినిమా కోసమేనా ?
x
Highlights

కథ నచ్చితే సినిమా కోసం, తన పాత్ర కోసం ఎంతైనా కష్టపడుతరారు బాలకృష్ణ. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు.

కథ నచ్చితే సినిమా కోసం, తన పాత్ర కోసం ఎంతైనా కష్టపడుతరారు బాలకృష్ణ. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకు బైరవదీపం, ఆదిత్య 369 చిత్రాలు చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజాగా అయన గుండుతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసారు. వైట్ అండ్ వైట్ ఖాదీ బట్టల్లో గుండు, గుబురు మీసాలతో బాలయ్య ఈ లుక్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ లో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా కోసమే బాలయ్య గుండు చేయించుకున్నాడా అన్నది సినీ సర్కిల్ లో హాట్ టాపిక్ గా నడుస్తుంది. అయితే దీనిపైన స్పష్టత రావాల్సి ఉంది.

సింహ, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత బాలయ్య- బోయపాటి కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. డ్వారక్ క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి సినిమాని నిర్మిస్తున్నారు. ఇక గత ఏడాది ఎన్టీఆర్ బయోపిక్, రూలర్ సినిమాలతో నిరశాపరచడంతో నందమూరి ఈ సినిమాపైన మంచి అంచనాలు పెట్టుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories