Balakrishna: మంచు కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేయబోతున్న బాలయ్య

* త్వరలో టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నందమూరి బాలకృష్ణ

admin1
Updated on: 7 Oct 2021 8:01 PM IST
Balakrishna is Going to Interview the Manchu Family in new Talk Show
X

మంచు కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేయబోతున్న బాలయ్య (ఫైల్ ఫోటో)

Balakrishna: ఒకవైపు నటన మరోవైపు రాజకీయాలు బ్యాలెన్స్ చేస్తూ 60 ఏళ్ళు దాటినప్పటికీ తన ఎనర్జీతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు నందమూరి బాలకృష్ణ. ఒక నటుడిగా, నిర్మాతగా, మరియు రాజకీయ నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న బాలకృష్ణ తాజాగా ఇప్పుడు మరొక అవతారంతో అభిమానులను అలరించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సామ్ జామ్ వంటి పలు సెలబ్రిటీ టాక్ షోస్ నిర్వహించిన ఆహా వీడియో ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ హోస్ట్ గా ఒక టాక్ షోని ప్లాన్ చేస్తోంది.

త్వరలోనే ఈ షో మొదలు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాలయ్య హోస్ట్ గా వ్యవహరించనున్న ఈ టాక్ షోకి మొట్టమొదటిగా విచ్చేయబోతున్నా సెలబ్రిటీ గెస్ట్ మరెవరో కాదు మంచి ఫ్యామిలీ మెంబర్స్ అని సమాచారం. మా ఎలక్షన్స్ పుణ్యమా అని ఇప్పటికే మంచు కుటుంబ సభ్యుల పేర్లు అందరి నోట్లో నానుతూ ఉన్నాయి. మరి ఈ సమయంలో బాలకృష్ణ వారిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

admin1

admin1

Next Story