Balakrishna: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావ్.. షో లో నవదీప్ పరువు తీసేసిన బాలయ్య..!

Balakrishna: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావ్.. షో లో నవదీప్ పరువు తీసేసిన బాలయ్య..!

Arun Chilukuri
Updated on: 28 March 2023 8:30 PM IST
Balakrishna: డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికావ్.. షో లో నవదీప్ పరువు తీసేసిన బాలయ్య..!
X

Nandamuri Balakrishna: ఒకవైపు "అఖండ", "వీర సింహా రెడ్డి" వంటి సూపర్ హిట్ సినిమాలతో కరియర్లో ముందుకు దూసుకుపోతున్న సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోవైపు డిజిటల్ మీడియాలో కూడా రియాలిటీ షో లు టాక్ షో లలో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవుతున్నారు. అన్ స్టాపుబుల్ రెండు సీజన్స్ తో బాలయ్య మరింత సక్సెస్ అయ్యారు. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు, యువ హీరోలు, ఆఖరికి రాజకీయ నాయకులు కూడా బాలయ్య షో కి గెస్ట్ లుగా విచ్చేశారు.

వారితో బాలకృష్ణ చాలా సరదాగా మాట్లాడుతూ ప్రేక్షకులను కూడా చాలా బాగా అలరించారు. తాజాగా ఆహా లో స్ట్రీమ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి కూడా బాలకృష్ణ విచ్చేశారు. అందులో తమ "న్యూ సెన్స్" అనే వెబ్ సిరీస్ నీ ప్రమోట్ చేస్తూ నవదీప్ మరియు బిందు మాధవి కూడా స్టేజ్ మీదకి వైల్డ్ కార్డు ఎంట్రీ లాగా వచ్చారు. అందులో భాగంగా మాట్లాడుతూ నవదీప్ ని ఉద్దేశించి బాలకృష్ణ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు.

తమ వెబ్ సిరీస్ జర్నలిజం గురించి అని నవదీప్ చెప్పగా దానికి బాలకృష్ణ, "ఆదివారం టీవీ ఆన్ చేస్తే శనివారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన నవదీప్, కారు వదిలి పారిపోయిన నవదీప్, అంటూ ఒకటే రచ్చ," అని బాలకృష్ణ కౌంటర్ వేశారు. దీంతో అక్కడున్న వారందరితో పాటు నవదీప్ కూడా నవ్వేశాడు. ఇక వెబ్ సిరీస్ టీజర్ ని చూసిన తర్వాత బాలకృష్ణతో పాటు అక్కడున్న వారు కూడా వీరిద్దరికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story