Balakrishna Movie Update: పల్నాటి వీరుడిగా కనిపించనున్న బాలయ్య

Balakrishna Movie Update: గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో పల్నాటి వీరునిగా బాలయ్య కనిపించబోతున్నాడని టాలీవుడ్ టాక్

Kranthi
Published on: 3 Jun 2021 6:59 AM IST
Balakrishna Gopichand Malineni Movie Update
X

Balakrishna Gopichand Malineni:(File Image) 

Balakrishna Movie Update: నందమూరి బాలయ్య మళ్లీ తొడగొట్టనున్నాడు. మీసం మెలేసి రోషంతో డైలాగులు చెప్పనున్నాడు. పల్నాటి పౌరుషాన్ని తన కంటి చూపులతోనే చూపించనున్నాడు. అవును పల్నాటి వీరుని కథతో తీసే సినిమాలో బాలకృష్ణ నటించబోతున్నాడు. అది కూడా యాక్షన్ సినిమాల డైరెక్టర్ మలినేని గోపిచంద్ డైరెక్షన్ లో... ఇక ఆ సినిమా కేక... బాలయ్య అభిమానులకు కెవ్వు కేక.

బాలయ్య సినిమాలన్నీ భారీ డైలాగులు, హైపవర్‌ యాక్షన్ సీన్లతో సాగుతూ.. నందమూరి అభిమానులకు మంచి కిక్కు నిస్తుంటాయి. ఇక ఇలాంటి కిక్కుకు తోడు ఓ చరిత్ర కారుని జీవితాన్ని బాలకృష్ణ రూపంలో చూస్తే ఎలా ఉంటుంది. రికార్డులన్నీ దాసోహం అనేలా ఉంటుంది కదూ..! ఇప్పుడు అలాంటి ఓ కథతోనే ఈ నటసింహం మన ముందుకు రోబోతున్నారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాలో.. బాలయ్య బాబు ఓ పల్నాటి చరిత్ర కారునిలా కనించబోతున్నారట.

ఇప్పుడిదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. యాక్షన్ సినిమాలను ఫర్ఫెక్ట్‌గా తెరకెక్కించే గోపీచంద్ మలినేని… బాలయ్య కోసం ఓ పల్నాటి వీరుని కథను సిద్దం చేశారట. ఇక ఈ స్టోరీని అనుకున్న తరువాత.. బాలయ్య రూపం.. ఆవేశమే గుర్తుకు వచ్చిందట. అందుకే ఈ సినిమాను ఎలాగైనా బాలయ్యతోనే తెరకెక్కించాలని పకడ్భందీగా బౌండెడ్ స్క్రిప్ట్ తో ఆయన్ని కలిసి ఓకే చేయించుకున్నారట.. ఈ యంగ్ డైరెక్టర్. ఇక ఇప్పటికే క్రాక్‌ సినిమాలో కటారి కృష్ణ క్యారెక్టర్‌ను వెండి తెరపై ఆవిష్కరించిన గోపీచంద్… పల్నాటి వీరునిగా బాలయ్యను ఇంకెలా చూపిస్తారో అంటూ.. అప్పుడే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ కూడా మొదలైంది.

Kranthi

Kranthi

Next Story