Balakrishna: ఆదిత్య 369 సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన బాలయ్య..!

* బాలకృష్ణ ఆదిత్య 369కి త్వరలోనే సీక్వెల్ వస్తుందని ఆదిత్య 999 మాక్స్ అనే టైటిల్తో త్వరలోనే సెట్స్ పై కి వేల్తున్దన్నారు

R Tripura Malini
Updated on: 8 Nov 2022 9:00 PM IST
balayya gave clarity on aditya 369 sequel
X

ఆదిత్య 999 మాక్స్ అప్పుడే సెట్స్ పైకి వెళుతుంది అంటున్నారు

Nandamuri Balakrishna: గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 90స్ లోనే "ఆదిత్య 369" వంటి సినిమా తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ ఆ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు కానీ అది మాత్రం ఇంకా పట్టాలెక్కలేదు. అద్భుతమైన విజన్ ఉన్న డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు "ఆదిత్య 369" కి దర్శకత్వం వహించారు. అయితే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న "ప్రాజెక్ట్ కే" సినిమా "ఆదిత్య 369" కి సీక్వెల్ అని కొందరు అన్నారు.

దానికి కారణం ఈ సినిమా విషయంలో సింగీతం శ్రీనివాసరావు కూడా ఒక భాగం అవ్వటం. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంగీతం శ్రీనివాసరావు దీని గురించి క్లారిటీ ఇచ్చారు. "ప్రాజెక్ట్ కే" కూడా ఒక సైన్స్ ఫిక్షన్ సినిమానే అని స్క్రిప్ట్ విషయంలో తాను కేవలం కొన్ని సజెషన్స్ మాత్రమే ఇచ్చానని చెప్పిన సింగీతం శ్రీనివాసరావు అది ఆదిత్య 369 కి సీక్వెల్ కాదని క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా అన్ స్టాపబుల్ టాక్ షోలో మాట్లాడుతూ బాలకృష్ణ ఆదిత్య 369 కి త్వరలోనే సీక్వెల్ వస్తుందని "ఆదిత్య 999 మాక్స్" అనే టైటిల్తో త్వరలోనే సెట్స్ పై కి వెళుతుందని అన్నారు. గతంలో కూడా ఆదిత్య 999 మాక్స్ లో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ నటిస్తాడని ఆ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెడతాడని వార్తలు వినిపించాయి. కానీ బాలకృష్ణ మాత్రం దీని గురించి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అభిమానులు మాత్రం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story