Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూ గురించి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna: నెక్స్ట్ ఇయర్ మోక్షజ్ఞ హీరోగా మారతాడు అంటున్న బాలయ్య

Jyothi
Published on: 27 Nov 2022 4:54 PM IST
Balakrishna Gave Clarity About His Son Tollywood Entry
X

Balakrishna: మోక్షజ్ఞ డెబ్యూ గురించి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

Balakrishna: ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ సీనియర్ హీరోల పుత్రులు ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయమైపోయారు. అయితే నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా తెలుగు ప్రేక్షకులకు దూరంగానే ఉంటున్నాడు. గత కొంతకాలంగా మోక్షజ్ఞ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు అని వార్తలు పుకార్లు అయితే వినిపిస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ ఈ పుకర్లపై స్పందించారు. "మీ అబ్బాయిని ఎప్పుడు హీరోగా పరిచయం చేస్తున్నారు?" అని అడగగా, బాలకృష్ణ నవ్వుతూ "నెక్స్ట్ ఇయర్" అని చెప్పారు. దీంతో త్వరలోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నాడు అని నందమూరి అభిమానులు సైతం ఎగ్జిట్ అవుతున్నారు.

అయితే డైరెక్టర్ గా బోయపాటి శ్రీను చేస్తారా అని అడగగా బాలకృష్ణ మాత్రం "దైవేచ్ఛ అంతే" అని అన్నారు. ఇప్పటికే బాలకృష్ణ మరియు బోయపాటి కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో "అఖండ" సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందా అని అడగగా బాలకృష్ణ తప్పకుండా చేస్తామని క్లారిటీ ఇచ్చారు బాలయ్య. అంతేకాకుండా ఇప్పటికే కథ రెడీ అయిపోయిందని కానీ ఎప్పుడు చేస్తాం అనేది ఇంకా తెలియాలి అని అన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో "వీరసింహారెడ్డి" సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు.

Jyothi

Jyothi

Next Story