బాలకృష్ణ కోసం అలాంటి కథ రెడీ చేసిన అనిల్ రావిపూడి

అనిల్ రావిపూడి కోసం పోలీస్ ఆఫీసర్ గా మారనున్న బాలకృష్ణ

admin1
Updated on: 30 March 2022 5:31 PM IST
Balakrishna Film With Direction of Anil Ravipudi | Tollywood News
X

బాలకృష్ణ కోసం అలాంటి కథ రెడీ చేసిన అనిల్ రావిపూడి

Balakrishna-Anil Ravipudi: "ఎఫ్2", "సరిలేరు నీకెవ్వరు" వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ లో అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం "ఎఫ్ 3" సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తరువాత అనిల్ రావిపూడి సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు అనిల్. అయితే ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది? సినిమాలో బాలకృష్ణ పాత్ర ఏంటి? అనే విషయాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా పుకార్లు బయటకు వచ్చాయి. అయితే ఈ సినిమా ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా పటాస్ లో కూడా హీరో కళ్యాణ్ రామ్ ను ముందు నెగటివ్ గా చూపించి కామెడీ పండించారు. ఇప్పుడు బాలకృష్ణ తో కూడా అదే స్ట్రాటజీ వాడబోతున్నట్లు గా తెలుస్తోంది. కానీ ఇప్పటిదాకా బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన అన్ని సినిమాల్లోనూ చాలా సీరియస్ సిన్సియర్ పాత్రల్లో కనిపించారు. అవి బ్లాక్ బస్టర్ లు గా కూడా మారాయి. మరి ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ గా ఎలా కనిపించబోతున్నారు అని ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story