నరసింహ స్వామి గుడిలో బాల‌య్య గ‌ర్జ‌న‌!

Balakrishna Fight Scene in Narasimha Swamy Temple
x

నరసింహ స్వామి గుడిలో బాల‌య్య గ‌ర్జ‌న‌!

Highlights

Balakrishna: ఈ మధ్య స్టార్ హీరోల సినిమా అంటే డైరెక్టర్లు ముందుగా హీరో ఎలివేషన్ ల మీద బాగా దృష్టి పెడుతున్నారు.

Balakrishna: ఈ మధ్య స్టార్ హీరోల సినిమా అంటే డైరెక్టర్లు ముందుగా హీరో ఎలివేషన్ ల మీద బాగా దృష్టి పెడుతున్నారు. ఇక ఇలాంటి ఎలివేషన్ యాక్షన్ సన్నివేశాలు నందమూరి బాలకృష్ణ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కూడా ఎలివేషన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉండటం వల్లే సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఇప్పుడు బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అయితే గోపీచంద్ మలినేని కూడా ఇప్పుడు బాలకృష్ణ సినిమా కోసం అదే స్ట్రాటజీని వాడ బోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఇరవై నిమిషాలకు పైగా ఒక అద్భుతమైన యాక్షన్ సన్నివేశం ఉండబోతుందట. ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం నరసింహ స్వామి గుడిలో జరుగుతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో ఒక పెద్ద సెట్ కూడా వేశారు. ఆ సెట్లోనే ఈ యాక్షన్ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ తీర్చిదిద్దారు. ఇక ఈ ఫైట్ సీక్వెన్స్ చాలా మాస్ గా స్టైలిష్ గా ఉండబోతోందని సినిమాకి ఒక పెద్ద హైలైట్ గా కూడా మా రాబోతున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ యాక్షన్ సన్నివేశం కోసం చిత్ర బృందం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని మరీ కంపోజ్ చేసినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories