International Yoga Day: నిర్మలత్వం కలిగించేదే యోగా- బాలకృష్ణ

International Yoga Day: హైదరాబాద్‌లో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి.

Arun Chilukuri
Published on: 21 Jun 2021 1:11 PM IST
Balakrishna Attends on Yoga Celebrations at Basavatarakam Cancer Hospital Hyderabad
X

International Yoga Day: నిర్మలత్వం కలిగించేదే యోగా- బాలకృష్ణ

International Yoga Day: హైదరాబాద్‌లో యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో జరిగిన యోగా డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. మునులు, రుషులు యోగా చేసే వారని అందుకే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని వివరించారు బాలకృష్ణ. కరోనా నియంత్రణలో ప్రభుత్వం చేసిన సూచనలు పాటించాలన్నారు.

యోగా సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వారికి, బసవతారకం హాస్పిటల్, డాక్టర్స్, యోగా గురువులు, సిబ్బందికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారాయన. మనసుకి స్వస్థత, నిర్మలత్వం కలిగించేదే యోగా అని చెప్పారు. మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి కావల్సిన సంకల్పాన్ని యోగా ఇస్తుందని, యోగం అంటే మనసుని గెలుచుకోవడం అంటూ పలు రకాల యోగాసనాల గురించి చెప్పి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు బాలకృష్ణ.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story