Balakrishna: రెమ్యునరేషన్ బాగా పెంచేసిన బాలకృష్ణ

Balakrishna: రెండవ సీజన్ కి భారీ రెమ్యూనరేషన్ అడుగుతున్న బాలకృష్ణ

Rama Rao
Updated on: 10 Feb 2022 1:30 PM IST
Balakrishna Asking for Huge Remuneration | Tollywood News
X

రెమ్యునరేషన్ బాగా పెంచేసిన బాలకృష్ణ

Balakrishna: సీనియర్ హీరోల నుంచి స్టార్ హీరోయిన్ల దాకా ఈ మధ్య అందరూ సెలబ్రిటీ టాక్ షో లకి హోస్ట్ లుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ హీరో బాలకృష్ణ కూడా "అన్స్టాపబుల్" అనే ఒక సెలబ్రిటీ టాక్ షో తో హోస్ట్ గా మారిపోయారు. ఈ షో తర్వాత బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది అనడం అతిశయోక్తి కాదు. ఈ షోలో తనలోని ఒక కొత్త యాంగిల్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు బాలకృష్ణ. తన కామెడీ టైమింగ్, వన్ లైనర్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అయితే "అన్స్టాపబుల్" కి సీజన్ 2 ఉంటుందా, ఉంటే బాలకృష్ణ మళ్లీ ఆ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తారా అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది.

నిజానికి బాలకృష్ణ కి మాత్రం "అన్స్టాపబుల్" సీజన్ 2 చేయాలని ఉంది. ఫస్ట్ సీజన్ చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి నిర్మాతలు కూడా సెకండ్ సీజన్ కి ముందుకు వస్తారు. కానీ తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ రెండవ సీజన్ కి భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సీజన్ కే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్న బాలకృష్ణ రెండవ సీజన్ కి రెమ్యునిరేషన్ మరింతగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో "అన్స్టాపబుల్" సీజన్ 2 ఎప్పుడు మొదలవుతుందో ఇంకా వేచి చూడాల్సిందే.

Rama Rao

Rama Rao

Next Story