Balakrishna as Aghora: 'అఘెరా' గా బాలయ్య.. హిట్ ఖాయమంటున్న ఫ్యాన్స్

Balakrishna in the shoes of Aghora for the Latest Schedule
x
బీబీ3 లో బాలయ్య బాబు లుక్ 
Highlights

Balakrishna as Aghora: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' బ్లాక్ బస్టర్స్ గా అలరించాయి.

Balakrishna as Aghora: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' భారీ బ్లాక్ బస్టర్స్ గా అలరించాయి. ప్రస్తుతం వీరి నుంచి మూడో సెన్సెషన్ రెడీ అవుతుంది. అయితే.. ఈ చిత్ర టైటిల్‌ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

BB3 గా పిలిచే ఈ సినిమా టైటిల్‌ను మే 28 న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. షూటింగ్ మాత్రం నెమ్మదిగా జరుగుతుంది. కాగా, ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం.. క్యారెక్టర్ యాక్టర్స్‌తో చాలా కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయని, వారందరి షెడ్యూల్ ను సిద్ధం చేయడం చిత్ర నిర్మాతలకు చాలా కష్టమైన పనిగా మారింది.

మరోవైపు, ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. బాల్యంలో విడిపోయిన ఇద్దరు సోదరుల ఆధారంగా ఈ కథ రూపొందించారని పుకార్లు వస్తున్నాయి. వారిలో ఒకరు అఘోరా గా కనిపిస్తారని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బాలయ్య బాబు తన రూపాన్ని మార్చుకున్నట్లు తెలిసింది. అలాగే మరో పాత్రలో బాలయ్య లాల్చి, పంచే ధరించి కనిపిస్తారంట. బాలయ్య కొత్త రూపాన్ని చూసిన అభిమానులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.

మిర్యాల రవీంద్రరెడ్డి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో బాల్యృష్ణతో ప్రగ్యా జైస్వాల్ రోమాన్స్ చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories