Balakrishna: అమెరికా బ్యాక్ డ్రాప్ తో బాలయ్య సినిమా

Balakrishna And Gopichand Malineni Movie Coming With American Backdrop
x

అమెరికన్ బ్యాక్ డ్రాప్ తో రానున్న బాలకృష్ణ మూవీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Balakrishna: విదేశీ నేపథ్యంలో సినిమా చేస్తున్న బాలకృష్ణ

Balakrishna: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో "అఖండ" అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ విదేశీ నేపథ్యంలో సినిమాలు చేయడం చాలా అరుదు కానీ ఈ సినిమా మాత్రం అమెరికా తో ముడిపడి ఉంటుందట. బాలకృష్ణ ను 2 షేడ్స్ లో చూపించబోతున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.

నందమూరి అభిమానులు అందరూ ఈ సినిమాకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం "జై బాలయ్య" అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. గోపీచంద్ మలినేని తన "క్రాక్" బ్యూటీ శ్రుతి హాసన్ ను ఈ సినిమాలో కూడా ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో దునియా విజయ్ నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories