నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ జయంతి రోజునే బాలయ్య మూవీ రిలీజ్

నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. ఎన్టీఆర్ జయంతి రోజునే బాలయ్య మూవీ రిలీజ్
x
Highlights

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. బాలయ్య హీరోగా బోయపాటి కాబోలో రూపొంతున్న సినిమాకు సంబంధించిన తాజా అప్ డేట్ విడుదల చేశారు చిత్రబృందం. వర్కింగ్ టైటిట్ గా BB3 అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. సినీయర్ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మే 28న ఈ సినిమా థియేటర్లో సందడి చేయనుంది. కాగా.. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ మూవీపై బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్,టీజర్, కు మంచి రెస్ఫాన్స్ వచ్చింది. బాలయ్యకు 106వ సినిమా కావడం విశేషం. ఈ మూవీని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిసోంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories