రికార్డు పోస్టర్లు తడి ఆరకముందే, తిరగ రాసేది బాలయ్యే ..ఫ్యాన్స్ సంబరాలు

Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'.

Samba Siva Rao
Updated on: 30 April 2021 1:47 PM IST
Akhanda: Balakrishna and Boyapati Srinu Movie Akhanda Creates New Record In Youtube
X

Akhanda Movie File Photo

Akhanda: నందమూరి నటసింహం బాలకృష్ణ-బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. రెండు వారాల క్రితం ఈ మూవీకి సంబంధించిన టైటిల్ రోర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య హిస్టరీ క్రియేట్ చేశారు. బాలయ్య నటించిన అఖండ టైటిట్ రోర్ య్యూటూబ్‌లో కేవలం 16 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే 50మిలియన్ వ్యూస్ సాధించిన సౌత్ ఇండియాన్ మూవీస్ లోనే టాప్ 2లో నిలిచింది. కేజీఎఫ్ మూవీ తర్వాత స్థానంలో బాలయ్య టైటిల్ రోల్ నిలవడం విశేషం. బాలయ్య తర్వాత యంగ్ హీరోలు, అల్లుఅర్జున్, తమిళ హీరో విజయ్, జూ. ఎన్టీఆర్ టీజర్స్ నిలిచాయి.

కేజీఎఫ్ మూవీ ఒక్కరోజులోనే యూట్యూబ్(Youtube)లో 50మిలియన్స్ వ్యూస్ సాధించింది. బాలయ్య అఖండ 16 రోజుల్లో రికార్డు సృష్టిస్తే.. పుష్ఫ 50 మిలియన్ వ్యూస్ రావడానికి 20 రోజులు పట్టింది. తమిళ హీరో విజయ్ థళపతి నటించిన మాస్టర్ టీజర్ నెల 12రోజులు పట్టింది. ఇక రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ కొమరంభీమ్ టీజర్ అయితే 5 నెలలు పట్టింది. అంచనాలు దాటి బాలయ్య అఖండ 16 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ ఘనత సాధించింది. దీంతో బాలయ్య అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ఈ సందర్బంలో పలువురు ఫ్యాన్స్ బాలయ్య అంటే రికార్డులకు చిరునామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు. అప్పట్లో రికార్డులు పోస్టర్స్ తడి ఆరకముందే ఆ రికార్డులను తిరగ రాసేది బాలయ్యే మళ్లీ నిరుపించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'రియల్ లైఫ్ లో acting carrector బిహేవియర్ నో వన్ ఈక్వల్ toబాలయ్య'. 'అగ్నికి వాయువు తోడైతే ఎలా ఉంటుందో బాలయ్య బాబుకు బోయపాటి తోడైతే విధ్వంసం కూడా ఇలాగే ఉంటుంది'. 'ఎవరు ఆపలేరు ప్రభంజనాన్ని , జై బాలయ్య జైజై బాలయ్య'.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

ఇక సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్స్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మే 28 వతేదీన విడుదల కావాల్సింది. కరోనా కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడడంతో ఈ సినిమా విషయంతో సందీగ్థం నెలకొంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చాడు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story