BB3 Title Roar: ఉగాది ఆకలి తీర్చేశారు..బాలయ్య, బోయపాటి మూవీ టైటిల్ ఫిక్స్

Balakrishna: బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చే మూడో చిత్రం టైటిట్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్య అఘోర పాత్ర పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Samba Siva Rao
Updated on: 13 April 2021 1:20 PM IST
BB3 Title Fix
X

BB3

Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూడో చిత్రం BB3. ''సింహా, లెజెండ్'' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవలే సినిమాను మే 28న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రిలీజ్ డేట్ ప్రకటించిన ఇంకా టైటిల్ విషయంలో మాత్రం సస్పెన్స్ వీడింది. ఉగాది పండగ సందర్భంగా ఈ మూవీ టైటిల్ ప్రకటించారు.

ఈ చిత్రానికి 'అఖండ' అనే పేరు ఖరారు చేస్తూ ఓ వీడియోను పంచుకుంది. ఇందులో 'కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ అదరగొడుతుంది. ఈ సినిమాకు మొదట 'మోనార్క్' అనే టైటిల్ ప్రచారంలోకి రాగా, ఆ తర్వాత 'గాడ్ ఫాదర్', అలాగే 'టార్చ్ బేరర్' అనే పేర్లు బయటకు వచ్చాయి దీంతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. అయితే ఉగాది రోజున 'అఖండ' అనే టైటిల్ వెల్లడించడంతో.. నందమూరి అభిమానులను ఫూల్ ఖూష్ అవుతున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్ పోషిస్తుండటం విశేషం. అఘోరాగా, అలాగే కలెక్టర్‌గా రెండు పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ రోర్, ఫస్ట్ లుక్ పోస్టర్ల సినిమాపై అంచనాలు మరింత పెంచాయి.

ద్వారక క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నందమూరి ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు కలగలుపుతూ ఈ సినిమా రూపొందిస్తున్నారు బోయపాటి. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో నాయిక పూర్ణ వైద్యురాలి పాత్రలో కనిపించనుందని సమాచారం. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.




Samba Siva Rao

Samba Siva Rao

Next Story