logo
సినిమా

Akhanda Trailer: కాసేపట్లో బాలయ్య అఖండ ట్రైలర్

Balakrishna Akhanda Trailer Going to Release Soon
X

అఖండ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Akhanda Trailer: నందమూరి నట సింహం బాలకృష్ణ నుండి సినిమా వస్తుంది అంటే బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు.

Akhanda Trailer: నందమూరి నట సింహం బాలకృష్ణ నుండి సినిమా వస్తుంది అంటే బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. బాలయ్య సినిమాలలో అయన నటన, యాక్షన్ సన్నివేశాలు చూసేందుకు ఎంతో ఇష్టపడతారు ఆయన అభిమానులు. అయితే నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరొయిన్ గా వస్తున్న చిత్రం "అఖండ" బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిరియాల రవీందర్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అఖండ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసేందుకు సిద్దమైంది ఆ చిత్ర యూనిట్. ఈ రోజు సాయంత్రం 7:09 గంటలకు విడుదలయ్యే ట్రైలర్ యొక్క పోస్టర్ ను మూవీ యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. బాలయ్య రెండు వేరు వేరు లూక్స్ లో కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్ర పోషించనున్నారు. కాగా తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు. అయితే ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు పలు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రిలీజ్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Web TitleBalakrishna Akhanda Trailer Going to Release Soon
Next Story