Akhanda: హిట్ సినిమాని చేతులారా వదులుకున్న హీరోయిన్లు

Akhanda: హిట్ సినిమాని చేతులారా వదులుకున్న హీరోయిన్లు
x

Akhanda: హిట్ సినిమాని చేతులారా వదులుకున్న హీరోయిన్లు

Highlights

Akhanda: బాలయ్య సినిమా ని మిస్ చేసుకున్న హీరోయిన్లు

Akhanda: బాలకృష్ణ సినిమా లకి హీరోయిన్లు దొరకటం కొంచెం కష్టమైన పని కానీ "అఖండ" సినిమా సూపర్ హిట్ అవడంతో ఈ పరిస్థితి మారే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". సింహా, లెజెండ్ సినిమాల తరువాత మరొకసారి చేతులు కలిపిన వీరిద్దరూ ఈ సినిమాతో మరొక హిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అప్పటిదాకా ఒక్క హిట్ కూడా లేని హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కి ఈ సినిమాతో మళ్ళీ లైఫ్ వచ్చినట్లు అయింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాని కొందరు వదులుకున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా ప్రగ్యా జైస్వాల్ కంటే ముందు కాజల్ ని సంప్రదించారు దర్శకనిర్మాతలు. కానీ స్టార్ బ్యూటీ నో చెప్పడంతో పాయల్ రాజ్ పుత్ ని సంప్రదించారు. కానీ తను కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేసింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ తెరిసా వంటి కొందరు హీరోయిన్ల కీ సంప్రదించారు కానీ ఎవరు ఈ సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రగ్య చేతికి చిక్కింది. ఇక ఈ సినిమా హిట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ మిగతా హీరోయిన్లకు మాత్రం ఒక మంచి హిట్ సినిమా ని మిస్ చేసుకున్నట్టే.

Show Full Article
Print Article
Next Story
More Stories