'బాలయ్య..నీకు ఎదురే లేదయ్యా'..'ఆచార్య'ను వెనక్కి నెట్టిన 'అఖండ' ‌

‍Balakrishna Akhanda Movie: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అఖండ'.

Samba Siva Rao
Published on: 22 April 2021 5:06 PM IST
Akhanda Movie Title Rore Records
X

అఖండ మూవీ టైటిల్ రోర్

‍Balakrishna Akhanda Movie:నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్నహ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో 'సింహా', 'లెజెండ్‌' వంటి బెగ్గెస్ట్‌ హిట్స్‌ తర్వాత వస్తున్న మూడో చిత్రం కావడంతో ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌లో ఉంటాయి. ఉగాది కానుకగా ఏప్రిల్‌ 13న విడుదలైన 'అఖండ' టైటిల్‌ రోర్ వీడియో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

బాలయ్య సరికొత్త లుక్‌లో క‌నిపించడం, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ సంగీతం అదిరిపోవడంతో ఈ టీజర్‌ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ టీజర్ 33మిలియన్లకి పైగా వ్యూస్ సాధించి అన్ని రికార్డులన్నీ బద్దలుకొట్టింది. 387k పైగా లైక్స్‌తో 'అఖండ' దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఏ సినిమాకు రాని వ్యూస్ బాలయ్య సినిమాకు రావడం అది కూడా టైటిల్ రోర్ కి రావడం సంచలనం. సినిమా మే 28 విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ యూట్యూబ్ లో చిరంజీవి ఆచార్య సినిమా రికార్డులను వెనక్కి నెట్టింది.

మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' టీజర్‌కి 19మిలియన్లు వ్యూస్‌ మాత్రమే వచ్చాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ రెండు చిత్రాల టీజర్ల‌పై చర్చ జరుగుతోంది. చిరంజీవి సినిమా టీజర్‌ను మించి ఎక్కువ వ్యూస్‌ సాధించడంతో బాలయ్య ఫ్యాన్స్ సంబరం చేసుకుంటున్నారు. 'జై బాలయ్య.. నీకు ఎదురే లేదయ్యా'అంటూ నందమూరి అభిమానులు ఆనందంతోె ట్వీట్స్ చేస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story