Akhanda Movie: అందుకే అఖండ విడుదలను వాయిదా వేస్తున్న బాలయ్య

Akhanda Movie: చిరంజీవి మీటింగ్ కోసం ఎదురు చూస్తున్న బాలయ్య

admin1
Updated on: 8 Sept 2021 3:00 PM IST
Balakrishna Akhanda Movie Postponed Due to Movie Ticket Rates Issue
X
అఖండ మూవీ (ఫైల్ ఇమేజ్)

Akhanda Movie Release Date: దసరా పండుగకు కేవలం కొన్ని వారాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో దసరాకి ఏ సినిమాలను విడుదల చేయబోతున్నారు అని ఇంకా క్లారిటీ మాత్రం రావాల్సి ఉంది. ఒకవైపు అక్టోబర్ 8న అఖిల్ హీరోగా నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" మరియు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన "కొండపొలం" సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ రెండు చిత్రాల విడుదల మాత్రం ఖాయం అని చెప్పుకోవచ్చు. దసరా వీకెండ్లో వచ్చే సినిమాలపై మాత్రం ఇంకా స్పష్టత రావడం లేదు. నిజానికి "ఆర్ఆర్ఆర్" సినిమా అదే సమయంలో విడుదల కావాలి కానీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

దసరా వీకెండ్ కి కేవలం ఐదు వారాలు మాత్రమే సమయం మిగిలి ఉంది. కానీ "అఖండ" చిత్ర ప్రమోషన్స్ మరియు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన ఇంకా బయటకు రాకపోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం చిత్ర దర్శక నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ లోని థియేటర్ టికెట్లు రేట్లు కి సంబంధించి తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారట. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఆ విషయంలో విషయంలో తుది నిర్ణయం వెలువడితే అఖండ సినిమాను దసరాకి విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

admin1

admin1

Next Story