Akhanda Movie: బాక్సాఫీస్ ని బద్దలు కొడుతున్న బాలయ్య

Akhanda Movie: కలెక్షన్లతో అందరినీ షాక్ కి గురి చేస్తున్న "అఖండ"

admin1
Updated on: 28 Dec 2021 11:45 AM IST
Balakrishna Akhanda Cinema Box Office Collections 125 Crores | Tollywood News
X

బాక్సాఫీస్ ని బద్దలు కొడుతున్న బాలయ్య

Akhanda Movie: నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో "సింహా", "లెజెండ్" వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపించగా నితిన్ మెహతా, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై మొదటి రోజు నుండి మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటోంది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 125 కోట్లు గడించిన ఈ సినిమా 25వ రోజు కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ గా నిలవటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది.

రన్ టైం ఎక్కువగా ఉన్నప్పటికీ, విడుదల అయ్యి ఎన్ని రోజులు గడుస్తున్నప్పటికీ సినిమా ఇంకా హౌస్ఫుల్ నమోదు చేసుకోవటం ట్రేడ్ వర్గాలను కూడా అవాక్కయ్యేలా చేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్ కూడా సినిమా కలెక్షన్ల కి బాగానే వర్క్ అయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా బాలయ్య బోయపాటి తమ హ్యాట్రిక్ హిట్ తో బాక్సాఫీస్ ని బద్దలు కొట్టారు.

admin1

admin1

Next Story