అఖండ గురించి ఆ దేశంలో కూడా మాట్లాడుకుంటున్నారు.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్..

అఖండ గురించి ఆ దేశంలో కూడా మాట్లాడుకుంటున్నారు.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్..
x

అఖండ గురించి ఆ దేశంలో కూడా మాట్లాడుకుంటున్నారు.. బాలయ్య వ్యాఖ్యలు వైరల్..

Highlights

Balakrishna: సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ".

Balakrishna: సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడవ సినిమా "అఖండ". టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా అఖండ విజయాన్ని సాధించింది. ఇంకా థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాకి సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు. ఈ వేడుకలో మాట్లాడుతూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాకిస్తాన్ లో కూడా తన సినిమాని ఎవరో చూసి బాగుందని తన ఆయన కి మెసేజ్ చేసినట్లు బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

"ఇవాళ పొద్దున్నే చూశాను.. పాకిస్థాన్లో కూడా.. అక్కడ వాళ్ళు.. అది ఎవరో నాకు వాట్స్అప్ చేశారు.. అక్కడ వాళ్లు మాట్లాడుకోవడం.. మన సినిమా గురించి మన పాకిస్థాన్లో "అఖండ" సినిమా గురించి.." అంటూ సక్సెస్ ఫంక్షన్లో బాలకృష్ణ అన్న ఈ వ్యాఖ్యలు విని స్టేజ్ మీద వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు నవ్వుకున్నారు. అసలు పాకిస్తాన్లో ఒక తెలుగు సినిమా గురించి చర్చ జరగడం ఏమిటి అంటూ కొందరు అభిమానులు కొట్టిపారేస్తూ ఉంటే మరికొందరు మాత్రం మన పాకిస్థాన్లో మన బాలయ్య అభిమానుల సంఘం ఏర్పడి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories