తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బలగం మూవీ డైరెక్టర్ వేణు

Venu: బలగం చిత్రానికి 31 అవార్డులు రావడం సంతోషంగా ఉంది

Jyothi
Published on: 13 April 2023 4:03 PM IST
Balagam Movie Director Venu Visit Tirumala Temple
X

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బలగం మూవీ డైరెక్టర్ వేణు

Venu: బలగం చిత్రానికి వివిధ కేటగిరీలో 31 అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉందని బలగం మూవీ డైరెక్టర్ ‌వేణు తెలిపారు. ఈ రోజు వేణుతో పాటు , రచ్చ రవి సుప్రభాత సేవలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు..దర్శనానంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో వారిని సత్కరించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

బలగం చిత్రం మంచి విజయాన్ని అందించినందుకు మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు కాలినడకన వచ్చామని వేణు తెలిపారు. తన మొదటి సినిమాని రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు ఆదరించి అభిమానించడం చాలా ఆనందంగా ఉందన్నారు.. పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఊరు వాడా అందరూ కలిసిగట్టుగా బలగం చిత్రాన్ని చూడటం, విడి పోయిన కుటుంబాలు కలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని వేణు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story