Balagam Movie: సూపర్ హిట్ సినిమా ఓటీటీ విడుదలపై షాక్ అయిన అభిమానులు

* సూపర్ హిట్ సినిమా ఓటీటీ విడుదలపై షాక్ అయిన అభిమానులు

Dhatripriya
Published on: 25 March 2023 12:12 PM IST
Block Buster Movie Appeared On OTT After Three Weeks Of Release
X

 విడుదలైన మూడు వారాలకే ఓటీటీ లలో ప్రత్యక్షమైన బ్లాక్ బస్టర్ సినిమా

Balagam: ఈ మధ్యనే దిల్ రాజు నిర్మాణంలో థియేటర్లలో విడుదలైన "బలగం" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ ను అందుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజు నుంచి చాలా మంచి టాక్ ను అందుకున్న ఈ సినిమా నిన్న రాత్రి ఓటీటీలో కూడా విడుదలైంది. కానీ థియేటర్లలో విడుదలైన సినిమాని కేవలం మూడు వారాల్లోనే డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో విడుదల చేయడంపై అభిమానులు మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.

ఈ మధ్యకాలంలో ఏ సినిమాకైనా పది రోజుల కంటే ఎక్కువ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకోవడం కష్టంగా మారింది. అలాంటిది చిన్న బడ్జెట్ సినిమాకు విడుదలై "బలగం" సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా చూసిన అందరూ చాలా మంచి పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. విడుదలైన 20 రోజుల తర్వాత కూడా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు నమోదు చేసుకుని అతిపెద్ద సక్సెస్ గా నిలిచింది. కానీ అలాంటి సినిమాని ఇంత త్వరగా ఓటీటీలలో విడుదల చేయటం ఏంటి అని అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

సినిమా విడుదల కి ముందు ఇంత పెద్ద హిట్ అవుతుందని తెలియక నిర్మాతలు కూడా తక్కువ అమౌంట్ కే డీలింగ్ క్లోజ్ చేసి ఉండొచ్చు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు అనూహ్య స్పందన లభించింది. ఇంకొక రెండు మూడు వారాల పాటు థియేటర్లో ఉన్నప్పటికీ మంచి కలెక్షన్లు అందుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. కనీసం చిత్రా నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫారం వారితో మాట్లాడి సినిమా విడుదలని మరికొంత వాయిదా వేసి ఉంటే బాగుండేది అని కొందరు చెబుతున్నారు. ఇక థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా ఓటీటీలలో కూడా మంచి కలెక్షన్లు నమోదు చేసుకుంటుంది.

Dhatripriya

Dhatripriya

Next Story