Bala Krishna: తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారు

Bala Krishna: నిన్నటి కంటే ఇవాళ పరిస్థితి మెరుగ్గా ఉంది

Jyothi
Published on: 29 Jan 2023 12:57 PM IST
Bala Krishna Reacts About Taraka Ratna Health Condition
X

Bala Krishna: తారకరత్న వైద్యానికి స్పందిస్తున్నారు

Bala Krishna: తారకరత్నకు అత్యవసర చికిత్స కొనసాగిస్తున్నారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తారకరత్నకు ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. నిపుణుల వైద్య బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తోంది. అత్యవసర చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు కుటుంబ సభ్యులు ఒకొక్కరుగా బెంగళూరు చేరుకుంటున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ కుటుంబ సమేతంగా బెంగళూరు వెళ్లారు. దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహాసిని, ఎమ్మెల్యే చినరాజప్ప, పలువురు టీడీపీ నేతలు నారాయణ హృదయాలయకు వెళ్లారు.

ఇవాళ తారకరత్న ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నారన్నారు బాలకృష్ణ. కళ్లల్లో స్పందన కన్పిస్తుందని.. చికిత్సకు సహకరిస్తున్నాడన్నారు. నిన్నటికంటే ఇవాళ కొంచెం పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. బ్లీడింగ్‌ కావడంతో స్టంట్ వేయడానికి వీలుపడలేదని వైద్యులు చెప్పారని తెలిపారు.

Jyothi

Jyothi

Next Story