కుటుంబసమేతంగా కృష్ణకు నివాళులర్పించిన బాలకృష్ణ

Bala Krishna: కుటుంబసమేతంగా కృష్ణకు నివాళుర్పించిన బాలకృష్ణ

Jyothi
Updated on: 16 Nov 2022 1:28 PM IST
Bala Krishna Pays Tribute to Super Star Krishna
X

కుటుంబసమేతంగా కృష్ణకు నివాళుర్పించిన బాలకృష్ణ

Bala Krishna: కృష్ణ భౌతికకాయానికి సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబం నివాళులర్పించింది. తన సతీమణి, కుమార్తెతో పద్మాలయ స్టూడియోకు వచ్చిన బాలకృష్ణ పూలమాల వేసి అంజలి ఘటించారు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో కృష్ణ మన మధ్య లేరన్నది నమ్మలేని నిజమని బాలకృష్ణ అన్నారు. ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశారని గుర్తుచేసుకున్నారు. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా తెలుగు చిత్ర సీమకు పరిచయం చేశారని చెప్పారు. పద్మాలయ స్టూడియోస్‌ స్థాపించి గొప్ప సినిమాలు తీశారని.. సాంఘిక, జానపద, చారిత్రక, పౌరాణిక చిత్రాలు తీసి అందరి హృదయాల్లో గొప్ప నటుడిగా నిలిచారని తెలిపారు. కొత్త దర్శకులు, నిర్మాతలను ఎన్టీఆర్‌, కృష్ణలే పరిచయం చేశారన్నారు బాలకృష్ణ.

Jyothi

Jyothi

Next Story