Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో బజరంగ్ పునియాకు కాంస్యం
Bajrang Punia (Photo: The Hans India)
Tokyo Olympics 2020 - Bajrang Punia: భజరంగ్ భళా అనిపించాడు. ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో ఔర అనిపించాడు. ప్రత్యర్ధికి ఒక్కపాయింట్ ఇవ్వకుండా ఉడుంపట్టు పట్టాడు. వరుసగా 8 పాయింట్ లు చేసి మరో పతకం సాధించి పెట్టాడు.. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. భారత రెజ్లర్ భజరంగ్ పునియా కజకిస్థాన్‌తో తలపడి భజరంగ్ భళా అనిపించాడు. కాగా, నిన్న జరిగిన సెమీస్‌లో అజర్‌బైజన్‌కు చెందిన అలియేవ్ చేతిలో బజరంగ్ 5-12తో ఓటమి పాలయ్యాడు.
Next Story




