తన కొడుక్కి రాజమౌళి పేరు పెట్టుకున్న బాహుబలి నటుడు!

తన కొడుక్కి రాజమౌళి పేరు పెట్టుకున్న బాహుబలి నటుడు!
x
Bahubali fame Kalakeya Prabhakar(file photo)
Highlights

ఒక నటుడుకి ఎప్పుడు, ఏవిధంగా పేరు వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు..అలాగే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కురహాతారి... హుహు.. నింబ.. ద్రోష్లస్ కెల్మీ.. అంటూ మహిష్మతి సామ్రాజ్యం పైన దండెత్తిన కాలకేయ పాత్ర బాగా క్లిక్ అయింది. ఆ పాత్రలో నటుడు ప్రభాకర్‌ నటించాడు.

ఒక నటుడుకి ఎప్పుడు, ఏవిధంగా పేరు వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు..అలాగే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో కురహాతారి... హుహు.. నింబ.. ద్రోష్లస్ కెల్మీ.. అంటూ మహిష్మతి సామ్రాజ్యం పైన దండెత్తిన కాలకేయ పాత్ర బాగా క్లిక్ అయింది. ఆ పాత్రలో నటుడు ప్రభాకర్‌ నటించాడు. ఆ పాత్రకి ప్రాణం పోశాడు. మొత్తానికి ఆ పాత్రతో పాపులర్ అయ్యాడు.

ప్రభాకర్, రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఇది మొదటిసారి ఏం కాదు.. అంతకుముందు మర్యాదరామన్న సినిమాలో కూడా నటించాడు. అయితే ఆ సమయంలో తనకి డైలాగ్స్ కూడా చెప్పడం రాదని, రాజమౌళి తన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకొని తనకి శిక్షణ ఇప్పించడాని, ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాలో గుర్తుండి పోయే పాత్రను ఇచ్చాడని, తనకు లైఫ్ ఇచ్చిన తన దేవుడు రాజమౌళి రుణం తీర్చుకునే అవకాశం వస్తుందో లేదో తనకు తెలియదని.. అందుకే తన కొడిక్కి రాజమౌళి పేరు పెట్టుకున్నాననీ ప్రభాకర్ వెల్లడించాడు.

ఇక బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ (రౌద్రం రణం రుధిరం) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories