Babu Mohan: ప్రకాశ్‌రాజ్‌ను నాగబాబు ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదు

Babu Mohan: ఎక్కడినుంచో వచ్చిన ప్రకాశ్‌రాజ్‌.. తెలుగువారిపై పెత్తనం చేయడమేంటని ప్రశ్నించారు బాబుమోహన్.

Arun Chilukuri
Published on: 9 Oct 2021 3:17 PM IST
Babu Mohan Sensational Comments on Prakash Raj
X

Babu Mohan: ప్రకాశ్‌రాజ్‌ను నాగబాబు ఎందుకు సపోర్ట్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదు

Babu Mohan: ఎక్కడినుంచో వచ్చిన ప్రకాశ్‌రాజ్‌.. తెలుగువారిపై పెత్తనం చేయడమేంటని ప్రశ్నించారు బాబుమోహన్. షూటింగ్‌లో కాస్త ఇబ్బంది అనిపిస్తే చాలు వెళ్లిపోయే ఆయన కళాకారుల సమస్యలు తీరుస్తాడా అని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ నేషనల్‌ అవార్డు గ్రహీత అంటూ బిల్డప్‌ ఇస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ పుట్టకముందే తెలుగువారు జాతీయ అవార్డులు తీసుకున్నారని చెప్పారు.

తెలుగు వారి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడుతున్న ప్రకాశ్‌రాజ్‌ను నాగబాబు ఎందుకు వెనకేసుకువస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు బాబుమోహన్‌. తాను చేసిన కొన్ని పాత్రల వల్ల 365 రోజులు హౌస్‌ఫుల్‌గా ఆడిన సినిమాలు ఉన్నాయి కానీ ప్రకాశ్‌రాజ్‌ను చూసి ఆడిన చిత్రాలు ఉన్నాయా అన్నారు బాబుమోహన్‌.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story