నాని రెస్పాండ్ అవ్వాల్సిందే అంటున్న బాబు

నాని రెస్పాండ్ అవ్వాల్సిందే అంటున్న బాబు
x
Highlights

మిగతా అన్ని భాషల్లో లాగానే తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో బాగానే క్లిక్ అయింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అయినప్పటికీ రెండో సీజన్ మాత్రం వివాదాలతో...

మిగతా అన్ని భాషల్లో లాగానే తెలుగులో కూడా బిగ్ బాస్ రియాలిటీ షో బాగానే క్లిక్ అయింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అయినప్పటికీ రెండో సీజన్ మాత్రం వివాదాలతో నిండింది. బిగ్ బాస్ షో సీజన్ 2 జరుగుతున్నన్నాళ్ళు కొన్ని వివాదాలు సాగితే సీజన్ అయిపోయిన తర్వాత కూడా మరి కొన్ని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. రెండో సీజన్ విజేత కౌశల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు అతని అభిమానులం అని హడావిడి చేసిన కౌశల్ ఆర్మీ వారే ఇప్పుడు అతనికి ఎదురు తిరగడం కొన్ని టీవీ చానల్స్ లో డిబేట్లకు సైతం వెళ్లడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విషయంలో నాని రియాక్ట్ అయితే బాగుంటుందని బిగ్ బాస్ కంటెస్టెంట్ బాబు గోగినేని అభిప్రాయపడ్డారు.

డిబేట్స్ లో భాగంగా కౌశల్ పై ఎదురు తిరిగిన కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్ మరియు టీం ఓటింగ్ ను ప్రభావితం చేశారని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయమై రుజువులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీటిపై నాని స్పందించాలని బాబు గోగినేని చెబుతున్నారు. బాబు గోగినేని హౌస్ లో ఉన్నప్పుడు 'గేమ్ ను గేమ్ లాగా ఆడాలి' అంటూ నాని ఆయనను మందలించిన సంగతి తెలిసిందే. అందుకని ఇప్పుడు నాని రియాక్ట్ అవ్వాల్సిందే అని అంటున్నారు బాబు గోగినేని. మరి నాని నిజంగా రియాక్ట్ అవుతాడో లేక తన పని తాను చూసుకుంటాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories