నాగచైతన్య "లాల్ సింగ్ చద్ద" గురించిన ఆసక్తికర వార్త వైరల్...

Babri Masjid Incident in Naga Chaitanya Laal Singh Chaddha Movie | Live News Today
x

నాగచైతన్య "లాల్ సింగ్ చద్ద" గురించిన ఆసక్తికర వార్త వైరల్...

Highlights

Naga Chaitanya - Laal Singh Chaddha: అమీర్ ఖాన్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "లాల్ సింగ్ చద్దా"...

Naga Chaitanya - Laal Singh Chaddha: ప్రస్తుతం అమీర్ ఖాన్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "లాల్ సింగ్ చద్దా". "ఆర్ ఆర్ ఆర్", "కె జి ఎఫ్: 2" సినిమాల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ రికార్డులను తిరగ రాయగల సత్తా ఉన్న సినిమా ఇదే అని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. "దంగల్" వంటి బ్లాక్ బస్టర్ సినిమా తో వెయ్యి కోట్లకు పైగా ప్రపంచవ్యాప్త కలెక్షన్లు నమోదు చేసుకున్న ఆమిర్ ఖాన్ ఈ సినిమాతో కూడా అ మళ్లీ వెయ్యి కోట్ల క్లబ్బులో చేరతారని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. టాలీవుడ్ హీరో నాగచైతన్య కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 90 ల నాటి కీలకమైన చారిత్రక అధ్యాయం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలకమైన ప్లాట్ ఎలిమెంట్ గురించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలు బాబ్రీ మసీదు బాంబు లాస్ట్ ఎపిసోడ్ కూడా ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

హాలీవుడ్ ఆస్కార్ విన్నింగ్ సినిమా "ఫారెస్ట్ గంప్" రీమేక్ గా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా కథకు దర్శకనిర్మాతలు కొంత భారతీయతను యాడ్ చేశారట. ఈ నేపథ్యంలోనే సినిమాలో బాబ్రీ మసీదు బాంబు బ్లాస్ట్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీక్రెట్ సూపర్ స్టార్ ఫేమ్ అద్వైత్ చందన్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories