Baahubali The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Baahubali: The Epic OTT Release Date Out: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ప్రభాస్-రాజమౌళిల విజువల్ వండర్ 'బాహుబలి'.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 12:20 PM IST
Baahubali The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
X

Baahubali The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Baahubali: The Epic OTT Release Date Out: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ప్రభాస్-రాజమౌళిల విజువల్ వండర్ 'బాహుబలి'. ఈ సినిమా విడుదలై పదేళ్లు కావస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' (Baahubali: The Epic) పేరుతో ఇటీవల రీ-రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిసెంబర్ 25 (క్రిస్మస్) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

థియేట్రికల్ రన్ కంటే భిన్నంగా ఉండబోతోందా?

అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ ఎడిట్‌లో దాదాపు 90 నిమిషాల నిడివిని తగ్గించారు. ముఖ్యంగా అవంతిక లవ్‌స్టోరీ, 'పచ్చ బొట్టేసిన', 'కన్నా నిదురించరా' వంటి పాటలతో పాటు కొన్ని యుద్ధ సన్నివేశాలను తొలగించి సినిమాను వేగంగా నడిపించారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న వెర్షన్‌లో ఆ తొలగించిన సన్నివేశాలను మళ్ళీ జోడిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం ఫుల్ లెంగ్త్ ఎపిక్ కోసం ఎదురుచూస్తున్నారు.

రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ షేక్

సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు వచ్చే స్పందన కంటే బాహుబలికి వచ్చిన స్పందన అద్భుతం. మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రీ-రిలీజ్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story