అప్పుడే సక్సెస్ దొరుకుతుంది అంటున్న తమన్నా

Ruthvik
Published on: 29 March 2019 11:21 AM IST
అప్పుడే సక్సెస్ దొరుకుతుంది అంటున్న తమన్నా
X

'బాహుబలి' సినిమా తరువాత బిజీ అయిపోయింది అనుకుంటే మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ పెద్దగా మెరుగుపడలేదు. కానీ ఆ తరువాత మాత్రం నక్క తోక తొక్కినట్టు ఆఫర్లు ఆమెపై వర్షం కురుసినట్టు కురిశాయి. ప్రస్తుతం ఈమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. అందులో మెగా స్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రసతిష్టాత్మక పెద్ద బడ్జెట్ సినిమా 'సై రా నరసింహ రెడ్డి' కూడా ఉండడం విశేషం. అయితే ఈ మధ్యనే మిల్కీ బ్యూటీ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా ఎవరికి ఎవరు పోటీ కాదని తమన్నా చెబుతోంది.

"ఇండస్ట్రీలో ఒకరి ఆఫర్లను మరొకరు కొట్టేయడం అనేది జరగదని. ఎవరి ఆఫర్లు వారివే. కొందరికి ప్రతిభ ఉన్నా కూడా ఆఫర్లు రావు. అది వారి దురదృష్టం. కానీ వారు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉంటే, తప్పకుండా ఏదో ఒక సమయంలో వారిని అదృష్టం వరిస్తుంది, కచ్చితంగా సక్సెస్ వారికి దక్కుతుంది" అని తమన్నా చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా తమన్నా బాలీవుడ్ 'క్వీన్' రీమేక్ అయిన 'దట్ ఈజ్ మహాలక్ష్మి', హారర్ కామెడీ 'అభినేత్రి 2', 'సై రా' సినిమాలతో బిజీగా వుంది. తమిళం నుండి కూడా తమన్నా కి మంచి అవకాశాలే ఉన్నాయి.

Ruthvik

Ruthvik

Next Story