"ఆది పురుష్" బ్యాన్ చేయాలి అంటూ కేసు వేసిన అయోధ్య పూజారి

Ban Adipurush Row: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్".

Arun Chilukuri
Updated on: 6 Oct 2022 7:30 PM IST
Ayodhya Ram Temple Head Priest Demands Ban On Adipurush Film
X

"ఆది పురుష్" బ్యాన్ చేయాలి అంటూ కేసు వేసిన అయోధ్య పూజారి

Ban Adipurush Row: ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా "ఆది పురుష్". ప్రముఖ సూపర్ హిట్ సినిమా తానాజీ ఫేమ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ టీజర్ మరియు అందులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయాయి అని చెప్పుకోవాలి.

ఈ నేపథ్యంలో సినిమాపై రోజురోజుకీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరుగుతూ వస్తోంది. ఒకవైపు దర్శక నిర్మాతలకు ఇదే పెద్ద తలనొప్పిగా మారగా మరొకవైపు "ఆది పురుష్" సినిమాని బ్యాన్ చేయాలి అంటూ అయోధ్యకి చెందిన ఒక పూజారి కేసు వేయడంతో మేకర్లకు కొత్త ఇబ్బంది వచ్చి పడినట్లు అయింది. సినిమాలో శ్రీరాముడిని, హనుమంతుడిని, రావణాసురుడిని చూపించిన విధానం ఏమాత్రం బాగాలేదని అందుకే సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాలి అంటూ అయోధ్య ప్రధాన పూజారి రామ్ పిటిషన్ ఫైల్ చేశారు.

రావణాసురుడిని చాలా తప్పుగా చూపించారు. సినిమాని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాలని మేము కోరుకుంటున్నాము అని ఆయన వాదిస్తున్నారు. మరోవైపు శ్రీరాముడిని, హనుమంతుడిని కూడా రామాయణంలో చెప్పిన విధంగా చూపించలేదని అలాంటి సినిమాని విడుదల చేయకపోవడం మంచిదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story