Avika Gor: అవికా గోర్ కి ఆఫర్ల వెల్లువ

Avika Gor:'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్.

Venkata Chari
Published on: 5 April 2021 8:01 AM IST
Avika Gour Full Busy With New Movie Offers
X

అవికా గోర్ (ఫొటో ఇన్‌స్టాగ్రాం)

Avika Gor: 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్. ఈ సినిమా విజయవంతమవడంతో.. ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తరువాత 'సినిమా చూపిస్త మావ' .. ' ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలు అవికా క్రేజ్ ను మరింత పెంచాయి. యూత్ లో ఈ పిల్లకి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెరిగిపోయింది. కానీ, ఆ తరువాత సరైన హిట్ లేకపోవడంతో... ఈ అమ్మడికి అవకాశాలు తగ్గిపోయాయి.

తాజాగా టాలీవుడ్లో అవికా గోర్ పేరు వినిపిస్తోంది. వరుసగా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కొత్త ప్రాజెక్ట్ లో అవికా గోర్ ను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరో సినిమాను రాజ్ తరుణ్ తో చేయనుంది. ఇన్ స్టాగ్రాంలో ఈవిషయాన్ని షేర్ చేశాడు ఈ యంగ్ హీరో. అవికా తన బెస్ట్ ఫ్రెండ్ అనీ .. త్వరలోనే ఆమెతో ఒక సినిమా చేయనున్నానని తెలిపాడు. అయితే వీరి కాంబో లో ముచ్చటగా మూడో సినిమా రానుంది. ఈ సినిమా హిట్ అయితే, అవికా గోర్, రాజ్ తరుణ్ జంట హిట్ ఫెయిర్ గా నిలవనుంది.

అలాగే, నాగ చైతన్య 'థాంక్యు' లో నూ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ ఉండగా, మూడో హీరోయిన్ గా అవికా గోర్ ..చైతూ తో రోమాన్స్ చేసేందుకు సిద్ధమైందని సమాచారం. ప్రస్తుతం వస్తున్న ఆఫర్లతో ఈ చిన్నారి పెళ్లి కూతురు చాలా సంతోషంగా ఉందని తెలుస్తోంది. గడ్డుకాలం నుంచి త్వరగా బయట పడాలని ఎదురు చూస్తున్న ఈ అమ్మడుకి... ఈ సారైనా సరైర బ్రేక్ వస్తుందో లేదో చూడాలి.

Venkata Chari

Venkata Chari

Next Story