హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న అవికా గోర్

హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతిపోగొడుతున్న అవికా గోర్
x

Avika gor

Highlights

చిన్నారి పెళ్లికూతురు( బాలికా వధు ) సీరియల్‌ ‘ఆనంది’గా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది నటి అవికా గోర్‌.

చిన్నారి పెళ్లికూతురు( బాలికా వధు ) సీరియల్‌ 'ఆనంది' గా దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది నటి అవికా గోర్‌. ఈ సిరియల్ లో అవికాను చూసిన వారంతా ఆనందిని పక్కింటి అమ్మాయిగా భావించేవారు. ఈ సీరియల్ ఇచ్చిన ఇమేజ్‌తో పలు సినిమాల్లో హీరోయిన్‌గా సత్తాచాటింది.అవికా గోర్ 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక అడపాదడపా సిల్వర్‌ స్క్రీన్‌పై తళుక్కుమన్న అవికా.. తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించబోతున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆవికా తన ప్రియుడు మిలింద్ చంద్వానీ పరిచయం చేస్తూ.. ఈ ఇడియట్‌ నావాడు అంటూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు పరిచయం చేసింది. కెరీర్‌ ఆరంభం నుంచి ఎక్కువగా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన ఈ అమ్మడు.. బికినీలో దర్శనమిచ్చింది. అంతేగాక బొద్దుగుమ్మ నుంచి నాజూకుగా మారిన ఆమె అధిక బరువు కారణంగా తాను ఎదుర్కొన్న విమర్శల గురించి పలు పోస్టులు పెడుతూ ట్రాన్స్‌ఫర్మేషన్‌ జర్నీ గురించి పంచుకుంది. ఈ క్రమంలో గురువారం ఓ స్టన్నింగ్‌ ఫొటోతో తన ఫాలోవర్లను ఆశ్చర్యపరిచింది అవికా.

అయితే అవిక పోస్టుపై అభిమానులు స్పందిస్తున్నారు. వెయిట్ తగ్గడానికి నువ్వు చూపిన అంకితభావం గొప్పదంటూ కొంతమంది ప్రశంసిస్తుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో.. అవికా ఇలా స్కిన్‌ షో చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. బరువు తగ్గడంతో ఆవికా గ్లామర్ తగ్గిపోయిందని కొంత మంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories