Avatar 3: అవతార్‌ 3 కాన్సెప్ట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్‌.. విడుదల ఎప్పడంటే..?

అవతార్‌ 3 చిత్రాన్ని డిసెంబర్‌ 19వ తేదీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Aug 2024 10:49 AM IST
Avatar Movie Makers Released Avatar 3 Concept and Release Date
X

Avatar 3: అవతార్‌ 3 కాన్సెప్ట్‌ను ప్రకటించిన చిత్ర యూనిట్‌.. విడుదల ఎప్పడంటే..?

Avatar 3: జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 160 భాషల్లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింటి. ఇప్పటి వరకు అవతార్‌ నుంచి రెండు పార్ట్స్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామిని సృష్టించాయి. ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ని ఈ సినిమా సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.

పండోర అనే గ్రహంపైకి మనుషులు వెళ్తే ఎలా ఉంటుంది. ఆ గ్రహంపై అప్పటికే జీవిస్తున్న వారితో ఎలాంటి సంఘర్షణ వాతావరణం నెలకొంటుంది లాంటి అంశాలతో అవతార్‌ సిరీస్‌లు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా అవతార్‌ మూడో భాగానికి సంబంధించి చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. అవతార్-3ని ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ పేరుతో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి మరోసారి పండోర గ్రహానికి వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అంటూ మూవీ మేకర్స్ ఆడియన్స్‌లో క్యూరియాసిటీని పెంచేశారు.


అవతార్‌ 3 చిత్రాన్ని డిసెంబర్‌ 19వ తేదీ విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అవతార్‌ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అవతార్‌3ని మరింత గ్రాండ్‌గా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. గతంలో వచ్చిన రెండు భాగాలలను మించి ఇందులో లైవ్‌ యాక్షన్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. భిన్నమైన కథనం, విభిన్నమైన క్యారెక్టర్స్‌తో పార్ట్‌3 ఉండనుంది. ఇక అవతార్‌ సిరీస్‌లో భాగంగా అవతార్‌ 3 చిత్రాన్ని డిసెంబర్‌ 19వ తేదీన విడుదల చేయనుండగా. అవతార్‌4ని 2029, అవతార్‌5ని 2031లో విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story