అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డు సృష్టించబోతున్న అవతార్

Avatar Movie is Going to Create a New Record in Telugu States Very Soon
x

అతి త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డు సృష్టించబోతున్న అవతార్ 

Highlights

Avatar: త్వరలో తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల మార్కుని అందుకోనున్న అవతార్ సినిమా

Avatar: 2009లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం అందించుకున్న "అవతార్" సినిమాకి సీక్వెల్ గా "అవతార్: ది వే ఆఫ్ వాటర్" ఈ మధ్యన డిసెంబర్ 16న భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా అవతార్ హవా బాగానే సాగుతోంది. మొదటి వారాంతం పూర్తయ్యేసరికి ఈ సినిమా 55 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకుంది. ఇక రెండవ వారం కలెక్షన్లు కూడా కలిపి ఈ సినిమా శనివారానికి 70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసుకుంది. త్వరలోనే 100 కోట్ల మార్కుని తాకడానికి పరుగులు తీస్తోంది.ఒకవేళ ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లను నమోదు చేసుకోగలిగితే ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్ల కలెక్షన్లను అందుకున్న మొదటి హాలీవుడ్ సినిమాగా రికార్డు సృష్టిస్తుంది.

జేమ్స్ కామరూన్ ఆవిష్కరించిన ఈ విజువల్ వండర్ భారత దేశ ప్రేక్షకులను కూడా మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బాలీవుడ్ లో విడుదలైన సర్కస్ మరియు తెలుగులో విడుదలైన ధమాకా, 18 పేజస్ వంటి సినిమాలకి దీటుగా అవతార్ సినిమా హౌస్ ఫుల్ బోర్డులను పెడుతోంది. డిసెంబర్ నెల ఈ హాలీవుడ్ విజువల్ వండర్ కి చాలా బాగా కలిసి వచ్చినట్టు చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఫైనల్ రన్ పూర్తయ్యే లోపల ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories