160 భాషల్లో విడుదలకు సిద్ధమైన అవతార్ 2.. ఎప్పుడంటే..

Avatar 2 to Release in 160 Languages
x

160 భాషల్లో విడుదలకు సిద్ధమైన అవతార్ 2.. ఎప్పుడంటే..

Highlights

Avatar 2: 2009 లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వం లో విడుదలైన హాలీవుడ్ సినిమా "అవతార్" సినిమా అప్పట్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది.

Avatar 2: 2009 లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వం లో విడుదలైన హాలీవుడ్ సినిమా "అవతార్" సినిమా అప్పట్లో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 25 మిలియన్ లకు పైగా కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక ఈ మధ్యనే జేమ్స్ కామెరూన్ ఈ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు. అవతార్ 2 అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా నిజానికి 2020 లోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కారోన కారణంగా షూటింగ్ చాలా సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ మధ్యనే సినిమాని పూర్తి చేసిన దర్శక నిర్మాతలు ఈ సినిమాని 2022 లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

తాజాగా అవతార్ 2 సినిమా కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 16న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాను ఏకంగా 160 భాషల్లో విడుదల చేయబోతున్నట్లు గా ప్రకటించి దర్శక నిర్మాతలు పెద్ద రికార్డు సృష్టించారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ను సినిమా కాన్ లో ప్రీమియర్ ప్రదర్శితం కూడా చేయబోతున్నారట. ప్రముఖ హాలీవుడ్ సూపర్ హీరో సినిమా అయిన "డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీ వర్డ్స్ ఆఫ్ మ్యాడ్నెస్" థియేటర్ల లో కూడా ఈ సినిమా గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories