భారీ మొత్తానికి అమ్ముడైన విజయ్ దేవరకొండ "ఖుషి" ఆడియో రైట్స్

* ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ వారు ఈ చిత్ర ఆడియో రైట్స్ ను 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు

R Tripura Malini
Updated on: 9 Nov 2022 8:00 PM IST
audio rights of khushi sold for huge amount
X

భారీ మొత్తానికి అమ్ముడైన విజయ్ దేవరకొండ "ఖుషి" ఆడియో రైట్స్ 

Kushi Movie Audio Rights: యువ హీరో విజయ్ దేవరకొండ ఈమధ్య వరుస ప్లాపులతో సతమతమవుతున్నారు. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, డియర్ కామ్రేడ్, మరియు ఈ మధ్యనే విడుదలైన లైగర్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇక విజయ్ దేవరకొండ తన ఆశలు అన్నీ తన తదుపరి సినిమా "ఖుషి" పైన పెట్టుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్గా నటిస్తోంది.

"మహానటి" సినిమాలో జంటగా కనిపించిన విజయ్ మరియు సమంత ఈ సినిమాలో కూడా రొమాన్స్ చేయనున్నారు. ఇక ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమా నుంచి ఒక్క పాట కూడా ఇంకా బయటకు రాలేదు కానీ అప్పుడే ఆడియో రైట్స్ మాత్రం భారీ మొత్తానికి అమ్ముడైపోవడం అభిమానులకు సైతం షాక్ ఇస్తుంది.

ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ వారు ఈ చిత్ర ఆడియో రైట్స్ ను 13 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. మలయాళం లో సూపర్ హిట్ అయిన "హృదయం" సినిమా ఫేమ్ అబ్దుల్ వాహెద్ "ఖుషి" సినిమాతో టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. పైగా "లైగ‌ర్" హిందీ వెర్ష‌న్ పాట‌ల‌న్నీ సూప‌ర్ హిట్‌ అయ్యాయి. అందుకే ఒక్క పాట కూడా ఇంకా విడుదల కాకుండానే ఆడియో రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. నిజానికి అన్ని ఆడియో సంస్థ‌లూ "ఖుషి" ఆడియో రైట్స్ కోసం పోటీ ప‌డ్డాయి. ఆక్ష‌న్ ప‌ద్ధ‌తిలో ఎక్కువ మొత్తానికి పాడుకొన్న స‌రిగ‌మ సినిమా రైట్స్ ద‌క్కించుకొంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story