logo

చిక్కుల్లో ఇరుక్కున్న విజయ్ సినిమా

చిక్కుల్లో ఇరుక్కున్న విజయ్ సినిమా
Highlights

కోలీవుడ్ స్టార్ హీరోల లో విజయ్ కూడా ఒకడు. తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ తన 63వ...

కోలీవుడ్ స్టార్ హీరోల లో విజయ్ కూడా ఒకడు. తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ తన 63వ చిత్రాన్ని అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు. తాజాగా ఈ చిత్రం అయింది వివాదాల పాలయింది. ఈ సినిమా ఫుట్బాల్ బాక్ డ్రాప్ తో సాగుతుందని తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా ఆరు కోట్లు పెట్టి ఫుట్బాల్ స్టేడియమ్ సెట్ ను కూడా వేయించాడు. ఈ నేపథ్యంలో ఒక యువ దర్శకుడు మీడియా ముందుకు వచ్చి ఈ చిత్ర కథ తాను రాసుకున్నది అని ఆరోపిస్తున్నాడు.

తను కథ తో చాలామంది నిర్మాతలను కలిశానని, ఈ నేపథ్యంలో ఎవరో ఒక నిర్మాత ఈ కథ అట్లీ చెప్పి ఉంటాడు అని, ఈ కథ తనదే అని రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు ఆ దర్శకుడు. అది నా కథ అని వాపోతున్నప్పటికీ, అట్లీ తన ఆవేదనను పట్టించుకోవడం లేదని పేర్కొన్నాడు. అందుకే ఫిర్యాదు దాకా వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. అయితే ఇంకా ఈ విషయమై విజయ్ కానీ అట్లీ కానీ రియాక్ట్ అవలేదు. అతను చెప్పే దాంట్లో ఎంత వరకు నిజం ఉందో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో విజయ్ నటించిన 'మెర్సల్' సినిమా పై కూడా కాపీ ప్రచారం జరిగింది మరి ఈ సమస్య నుండి విజయ్ మరియు అట్లీ ఎలా బయటపడతారో చూడాలి.

లైవ్ టీవి

Share it
Top