Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి అప్పుడే అంటున్న జ్యోతిష్కుడు

Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ప్రభాస్ పేరు ముందే ఉంటుంది.

Shireesha
Updated on: 9 March 2022 12:00 PM IST
Astrologer Dr. Acharya Vinod Kumar about Pan India Star Prabhas Marriage | Tollywood News
X

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి అప్పుడే అంటున్న జ్యోతిష్కుడు

Prabhas Marriage: ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లలో ప్రభాస్ పేరు ముందే ఉంటుంది. దాదాపు చాలా మంది హీరోలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ప్రభాస్ పేరు మాత్రం ఇంకా ఈ జాబితాలోనే మిగిలిపోయింది. వరుసగా ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్న ప్రభాస్ ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారు ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటారు అంటూ ఇప్పటికి బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి కానీ అందులో ఒక్కటి కూడా నిజం కాలేదు.

ఇంక డార్లింగ్ ప్రభాస్ పెళ్లి గురించి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రముఖ జ్యోతిష్కుడు ఆచార్య వినోద్ కుమార్ ప్రభాస్ పెళ్లి గురించి జ్యోతిష్యం చెప్పారు. "హీరో ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబర్ 2022 నుంచి అక్టోబర్ 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. ఇక సినిమాల పరంగా కూడా ప్రభాస్ చాలా బాగా రాణిస్తాడు. త్వరలోనే ప్రభాస్ కొత్త మనుషులను కలుసుకుంటాడు.

అందులో తన జీవిత భాగస్వామి కూడా ఉండబోతుంది," అని జోతిష్యం చెప్పాడు వినోద్ కుమార్. మరి 42 ఏళ్ల ప్రభాస్ విషయంలో వినోద్ జ్యోతిష్యం ఎంతవరకు నిజం అవుతుందో వేచి చూడాలి. ఇక ప్రభాస్ హీరోగా నటించిన "రాధే శ్యామ్" సినిమా ఈ నెల మార్చి 11వ తేదిన విడుదలకు సిద్దమవుతోంది. స్టార్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహించారు.

Shireesha

Shireesha

Next Story