Harish Shankar: ఆస్ట్రల్ పైప్స్ యాడ్‌లో అల్లు అర్జున్ స్టైలిష్‌గా కనిపిస్తాడు
Harish Shankar: యాడ్ విడుదల చేసిన దర్శకుడు హరీష్ శంకర్
హీరో అల్లు అర్జున్‌తో ఆస్ట్రల్ పైప్స్ కమర్షియల్ యాడ్
Harish Shankar: త్వరలోనే హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేస్తానని ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో రూపొందించిన ఆస్ట్రల్ పైప్స్ కమర్షియల్ యాడ్‌ను బంజారాహిల్స్ GVK మాల్‌లో దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో తీసే చిత్రానికి సంబంధించిన కథపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు. వాణిజ్య ప్రకటనలో అల్లు అర్జున్ స్టైలిష్‌గా కనిపిస్తాడని తెలిపారు. ఆస్ట్రల్ పైప్స్ లీకేజీ కాకుండా అత్యంత నాణ్యత పరిణామంతో, నిర్మాణాల్లో వినియోగించదగ్గ వస్తువు అని ఈ యాడ్ ద్వారా అల్లు అర్జున్ సందేశాన్ని ఇచ్చారు.
Next Story




