"సీతారామం" సినిమాని ట్రిమ్ చేసిన అశ్వినీ దత్

Ashwini Dutt: "మహానటి" సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళం హీరో దుల్కర్ సల్మాన్..

Arun Chilukuri
Published on: 29 July 2022 3:38 PM IST
Ashwini Dutt Trimmed the Movie Sita Ramam
X

"సీతారామం" సినిమాని ట్రిమ్ చేసిన అశ్వినీ దత్

Ashwini Dutt: "మహానటి" సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళం హీరో దుల్కర్ సల్మాన్ తాజాగా ఇప్పుడు "సీతారామం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. "పడి పడి లేచే మనసు" సినిమాతో ఫ్లాప్ అందుకొని ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని అనుకుంటున్న హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంది. మరోవైపు చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా సినిమా రన్ టైం గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా ఫైనల్ కాపీ పూర్తి చేసే సమయంలో ఎడిటింగ్ లో కూడా తన అనుభవాన్ని చూపించిన నిర్మాత అశ్విని దత్ సినిమాని పది నిమిషాలు ట్రిమ్ చేశారు.

ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 47 నిమిషాలు ఉండగా అశ్వినీ దత్ ఈ సినిమాని ట్రిమ్ చేసి కొన్ని సన్నివేశాలను కట్ చేసి నిడివిని రెండు గంటల 37 నిమిషాలకు కుదించారు. రెండు గంటల 37 నిమిషాలు కూడా ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ రన్ టైం అయినప్పటికీ సినిమా బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story