Ashwani Dutt: శరన్నవరాత్రి వేడుకలలో ప్రభాస్ "ప్రాజెక్ట్ కే" నిర్మాత

* మీడియా కంటికి చిక్కిన అశ్వినీదత్ సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటిదాకా 12 రోజుల షూటింగ్ పూర్తిచేశామని చెప్పుకొచ్చారు

admin1
Updated on: 13 Oct 2021 3:29 PM IST
Ashwani Dutt Says about Project K Movie 12 days Shooting
X

శరన్నవరాత్రి వేడుకలలో ప్రభాస్ "ప్రాజెక్ట్ కే" నిర్మాత(ఫైల్ ఫోటో)

Ashwani Dutt: ప్రభాస్ ఒక వైపు "రాధే శ్యామ్", "సలార్" మరియు "ఆదిపురుష్" సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో "ప్రాజెక్ట్ కే" (వర్కింగ్ టైటిల్) సినిమా కూడా సైన్ చేశారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాని నిర్మిస్తున్న అశ్వినీదత్ మంగళవారం చండీ యాగం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని పురుషోత్తమ రామమందిరంలో ఉన్న శ్రీ మేధా దక్షిణామూర్తి, గాయత్రి అమ్మవార్ల సన్నిధిలో దసరా వేడుకలు జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రి వేడుకలలో అశ్విని దత్ కూడా పాల్గొన్నారు. పూజలు చేయడంతో పాటు లక్ష్మీ గణపతి, రుద్రయాగ సహిత చండీయాగం కూడా చేయించారు.

ఇక, అక్కడ మీడియా కంటికి చిక్కిన అశ్వినీదత్ సినిమా గురించి మాట్లాడుతూ ఇప్పటిదాకా 12 రోజుల షూటింగ్ పూర్తిచేశామని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకూ షూటింగ్ కొనసాగుతుంది అని, దీనిని రూ. 500 కోట్ల బడ్జెట్ తో సినిమా నిర్మిస్తున్నామని తెలిపారు. "ప్రాజెక్ట్ కే" కాకుండా మరొక రెండు సినిమాలు కూడా నిర్వహిస్తున్నామని, 'అన్నీ మంచి శకునములే' చిత్రీకరణ కూడా జరుగుతోంది అని చెప్పారు. ఆయనతో పాటు సాహితీవేత్త యర్రాప్రగడ రామకృష్ణ దంపతులు, మల్లాది కల్యాణ్ కుమార్, దోర్భల ప్రభాకరశర్మ తదితరులు కూడా శరన్నవరాత్రి వేడుకలలో పాల్గొన్నారు.

admin1

admin1

Next Story