ఓటీటీలోకి 'అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Ashoka Vanam Lo Arjuna Kalyanam OTT Release Date Fixed
x

ఓటీటీలోకి ‘అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Highlights

Ashoka Vanamlo Arjun Kalyanam: యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో మంచి హిట్ ని నమోదు చేసుకున్నారు.

Ashoka Vanamlo Arjun Kalyanam: యువ హీరో విశ్వక్ సేన్ ఈ మధ్యనే "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో మంచి హిట్ ని నమోదు చేసుకున్నారు. ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఈసారి "అశోకవనంలో అర్జున కళ్యాణం" అనే సినిమాతో ఒక వినోదాత్మక పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. రొమాంటిక్ కామెడీగా ఈనెల ఆరో తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటోంది. విడుదలకు ముందు ఈ సినిమా కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నప్పటికీ సినిమాకి అది బాగానే ప్లస్ అయింది.

ఈ మధ్యనే థియేట్రికల్ రన్ ను పూర్తిచేసుకున్న "అశోకవనంలో అర్జున కళ్యాణం" తాజాగా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్ ఫారం ఆహా వారు ఈ చిత్ర డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ఈనెల 27 నుంచి ఆహా లో స్ట్రీమ్ కాబోతోంది. విద్యా సాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ మరియు రితికా నాయక్ లు హీరోయిన్లుగా నటించారు. ఎస్ వీ సీ పీ బ్యానర్ పై బాపినీడు మరియు సుధీర్ ఈదర ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories